24 August, 2026 | 3:26 AM

పడిక్కల్ శతకం

24-08-2026 12:17 AM

రాణించిన జైస్వాల్, గిల్, జడేజా

భారత్ స్కోరు 300/5

సారాంశ్ జైన్ అరంగేట్రం

తొలి టెస్ట్ విజయంతో జోష్ మీదున్న టీమిండియా రెండో టెస్టులోనూ సత్తా చాటుతోంది. వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ మరో సెంచరీతో చెలరేగిన వేళ, కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించిన వేళ తొలిరోజు భారత్ అధిపత్యం కనబరిచింది. 

కొలంబో , ఆగస్టు 23 : ఊహించినట్టుగానే రెండో టెస్టులో భారత్ , శ్రీలంక తుది జట్ల లో మార్పులు జరిగాయి. భారత్ తరపు న కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ అరంగేట్రం చేశాడు. అలాగే లంక జట్టులో గాయాల కారణంగా దినేష్ చండిమాల్, కుసల్ మెండిస్ దూరం అవ్వగా, వారి స్థానంలో కామిల్ మిశ్రా, పసిందు సూరియబండార అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు ఓ మోస్తారు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. జైస్వాల్ దూకుడుగా ఆడి నా రాహుల్ 18 రన్స్ కు వెనుదిరిగాడు. కాసేపటికే జైస్వాల్ (45) కూడా ఔట్ అవడంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయిం ది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు.

కెప్టెన్ గిల్ తో కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గతేడాది నుంచి లభించిన అవకాశాలను సద్వినియో గం చేసుకుంటున్న దేవదత్ పడిక్కల్.. ఈ మ్యాచ్లో తన అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తూ వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. ఎంతో కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు.పడిక్కల్ చూపించిన ఓర్పు, సంయమనం అందరినీ ఆకట్టుకున్నాయి. అనవసరమైన షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకుంటూ 168 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

తన సెంచరీలో ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా కేవలం 10 ఫోర్లతో మైదానమంతా క్లాసిక్ షాట్లు బాదాడు. అటు కెప్టెన్ గిల్ కూడా ఫామ్ అందుకున్నా డు. నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో గిల్ ఇప్పుడు భారత్ తరపున 3,000 టెస్ట్ పరుగులు చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడైన బ్యాటర్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, శుభ్మన్ గిల్ కంటే తక్కువ వయస్సులోనే ఈ ఘనతను సాధించారు.

గిల్ 50 పరుగులకు ఔట్ అవగా, కాసేపటికే పంత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అటు పడిక్కల్, జడేజాతో కలిసి 74 పరుగుల పార్టనర్ షిప్ సాధించాడు. ఈ క్రమంలో పడిక్కల్  117 (12 ఫోర్లు) రన్స్ కు ఔటవగా, జడేజా 43 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు (ఆగస్టు 23, 20)  ఆట ముగిసే సమయానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జురెల్ (7), సరాంశ్ జైన్ (4) ఉన్నారు. అయితే ఐదు వికెట్లు తీసిన లంక బౌలింగ్ కూడా ఆకట్టుకుంది. కాగా భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

స్కోరు బోర్డు 

భారత్ తొలి ఇన్నింగ్స్: 300/5 (పడిక్కల్ 117, గిల్50, జైస్వాల్ 45 జడేజా43; ఫెర్నాండో 3/46)