7 May, 2026 | 7:29 PM

సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకోండి

23-06-2024 03:20 AM
  • ఇందుకు పూర్తి అధికారాన్ని ఉపయోగించుకోండి

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

వనపర్తి, జూన్ 22 (విజయక్రాంతి)/ పెబ్బేర్: రైతులకు సాగునీరు ఇచ్చేందుకు అధికారులు తమకున్న పూర్తి అధికారాలను ఉపయోగించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాలువల్లో జమ్ము తొలగించేందుకు వెంటనే డీ సెల్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం వనపర్తి కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి విద్యా, వైద్య, విద్యుత్తు, నీటి పారుదల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లా డుతూ.. సాగు నీటి సరఫరాకు అధికారులు చర్యలు వేగవంగం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 70 మిని లిఫ్ట్‌లలో మోట ర్లు పని చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, వాటిపై చర్యలను తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించేలా విద్యాధికారి పర్యవేక్షించచాలనారు పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు సబ్ స్టేషన్‌లపై ఆరా తీశారు. 2017 నేటికీ ప్రా రంభానికి నోచుకోకపోవడానికి గల కారణా ల గురించి ప్రశ్నించారు. గృహజ్యోతి కింద జిల్లాలో కేవలం 63 వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏంట ని అడిగారు. దానికి అధికారి స్పందిస్తూ ప్రజాపాలన దరఖాస్తులో సమస్యలు కారణంగా ఆలస్యం అవుతోందన్నారు. ఈ స మావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గం గ్వార్, నగేశ్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పె బ్బేర్ మండలంలోని సూగూర్‌లో అంబేద్క ర్ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు.