15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముగిసిన పద్మశాలి సంఘం ఎన్నికల ప్రచారం

14-06-2025 12:17 AM

హోరాహోరిగా అభ్యర్థుల ప్రచారం

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరా హోరిగా సాగింది గత వారం రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో పద్మశాలి కుల బాంధవుల ఇండ్లు అభ్యర్థుల తాకిడితో కళకళలాడాయి. ఈనెల 15న నిర్వహించనున్న ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ప్రచారం చివరి రోజు పోటీలో ఉన్న అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష బరిలో నిలిచిన బత్తుల శ్రీనివాస్ తన అనుచరులతో మార్కెట్ నుండి పట్టణంలోని పలు కాలనీల మీదుగా పద్మశాలి కుల బాంధవులను కలుస్తూ బైక్ ర్యాలీ చేపట్టగా, మరో అభ్యర్థి బత్తుల సతీష్ బాబు తనను గెలిపించాలని కోరుతూ మార్కెట్ లో పాదయాత్ర చేపట్టి కుల బంధువుల ఓట్లను అభ్యర్థించారు. మరో అభ్యర్థి అడిచర్ల నాగేందర్ వ్యక్తిగతంగా కుల బంధువులను కలుస్తూ తనని గెలిపించాలని ప్రచారం కోరుతున్నారు. అధ్యక్ష బరిలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం బత్తుల సతీష్, బత్తుల శ్రీనివాస్ మధ్యనే ఉందని కుల బంధువులు చర్చించు కుంటున్నారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 15 న తేలనుంది.