17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

14-06-2025 12:18 AM

జగిత్యాల అర్బన్, జూన్ 13 (విజయక్రాంతి): పిల్లలకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షర అభ్యాసం, బాల సభ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇందులో భాగంగా శుక్రవారం మల్లాపూర్ మండలం హుసేన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా నమోదైన 16 మంది విద్యార్థులకు జిల్లా విద్యాధికారి కే. రాము అక్షర అభ్యాసం చేయించి వారందరికీ పలకలు పంపిణీ చేశారు. అనంతరం వి ద్యాధికారి మాట్లాడుతూ పిల్లలందరినీ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, తప్పనిసరిగా పిల్లలను ఉన్నత స్థాయికి చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

అనంతరం మధ్యాహ్న భోజనం అమలు తీరు, నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. డిఈ ఓ వెంట మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి,జిల్లా విద్యాశాఖకోఆర్డినేటర్ పాల్గొన్నారు.