నొప్పిలేని వైద్యమే నిజమైన సంతృప్తి
- మెడికవర్ ప్రముఖ డాక్టర్ ఉదయ్ కృష్ణమైనేని
- మూవ్‌మెంటమ్ 2026 నిర్వహణ
- 25వేల శస్త్రచికిత్సలకుపైగా విజయవంతంగా పూర్తి
- జుంబా ఫిట్‌నెస్‌లో డా. ఉదయ్ కృష్ణమైనేనితో పాల్గొన్న వందమంది రోగులు, కుటుంబాలు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): విజయవంతమైన శస్త్రచికిత్స కంటే రోగులకు నొప్పిలేని, చురుకైన జీవితాన్ని తిరిగి అందించడమే వైద్యుడికి నిజమైన సంతృప్తి అని మెడికవర్ ఆసుపత్రి (సికింద్రాబాద్) ప్రము ఖ డాక్టర్ ఉదయ్‌కృష్ణమైనేని అన్నారు. 25 వేలకుపైగా శస్త్రచికిత్సలు పూర్తి చేయడం రోగులు మాపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. అత్యాధునిక, రోగి కేంద్రిత ఆర్థోపెడిక్ సేవలను అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఆదివారం మెడికవర్ ఆసుపత్రి సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మూవ్‌మెంటమ్ 2026’ను నిర్వహించారు. 25వేలకు పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలను విజయవంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రికి చెంది న ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ కె. సతీష్ కుమార్ (సీనియర్ కన్సల్టెంట్ జా యింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపిక్ అండ్ ట్రా మా సర్జన్),
డాక్టర్ వినయ్ కందుకూరి (కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్, ట్రామా అండ్ స్పోర్ట్స్ మెడిసిన్), డాక్టర్ రవీష్ అజ్మీ రా (కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ట్రామా అండ్ జాయిం ట్ రీప్లేస్మెంట్ సర్జన్), డాక్టర్ అనుదీప్ పెద్దినేని (కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పున్ సర్జన్), డాక్టర్ రాజు బి (కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శ్రీనివాస్ (హెచ్‌వోడీ అనస్థీషియా), కృష్ణవేణి (సెంటర్ హెడ్), డాక్టర్ ప్రశాంత్ (మెడికల్ సూపరింటెండెంట్) పాల్గొన్నారు.






