20 July, 2026 | 6:14 PM

Breaking News

అత్యాచారం కేసులో నిందితుడికి 20 వేల జరిమాన   •   బ్యాంక్ వార్షికోత్సవం   •   అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం   •   పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి   •   రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన   •   గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •  

రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇచ్చే సామాజిక విప్లవ పత్రం

20-07-2026 12:30 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

ఘట్ కేసర్, జూలై 19 (విజయక్రాంతి) : భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన గ్రంథం కాదని అది ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే విలువలను హామీ ఇచ్చే సామాజిక విప్లవ పత్రం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాది అయితే, డాక్టర్ అంబేద్కర్ ఆ పునాదికి శాశ్వత శిల్పి.

రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను, ప్రతి పౌరుని హక్కులను, మానవ గౌరవాన్ని గౌరవించినట్టే అని పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 275వవారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ, అంబేద్కర్ చేసిన ఉద్యమాలు, భారత రాజ్యాంగ విషష్ఠతను ఇలా వివరించారు. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కూడిన రాజ్యాంగాని భారతదేశ ప్రజలకి ఇచ్చిన ఘనత అంబేద్కర్ కి మాత్రమే చెందుతుందన్నారు. బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం అయన చేసిన కృషిని గుర్తుచేస్తూ అంబేద్కర్ నుంచి యువకులు స్ఫూర్తిని పొంది అజ్ఞానం వీడి జ్ఞానం వైపు నడవాలని పిలుపునిచ్చారు.

అందేశ్రీ 65వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాలు యాదవ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, డాక్టర్ మీసాల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ ఘట్కేసర్ పోచారం డివిజన్ల అధ్యక్షులు బొక్కా ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్ నాయకులు కొంతం అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ మేడ బోయిన వెంకటేష్, కట్కూరి నర్సింగ్ రావు, బర్ల రాధా కృష్ణ ముధిరాజ్, బొక్క సంజీవరెడ్డి, జి. నర్సింహా, రాందాస్, రెహమాన్, ఉజీద్, ఏ. నగేష్, కె. సత్యం, తోక మల్లేష్, మేకల సునీల్, తదితరులు పాల్గొన్నారు.