21 July, 2026 | 11:33 PM

Breaking News

మోదీకి అభినందనలు చెప్పని పాక్

09-06-2024 02:26 AM

భారత్‌లో ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదని వ్యాఖ్య

ఇస్లామాబాద్, జూన్ 8: మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధినేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. కానీ, దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా బలోచ్ స్పందించారు. భారత ఎన్నికల ప్రక్రియపై మేం మాట్లాడేందుకు ఏమీ లేదు. అక్కడ ఇంకా అధికారికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు.

ఇప్పుడే అభినందనలు చెప్పడం తొందరపాటు అవుతుంది ఆమె తెలిపారు. భారత్‌తో సంబంధాలపై మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ వంటి కీలక సమస్యలతో పాటు ఇతర వివాదాలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటోందన్నారు. భారత్‌తో సహా పొరుగు దేశాలతో  సత్సంబంధాలకే పాక్ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. భార త్ కూడా పాక్‌తో మంచి సంబంధాలనే నెరపాలని పలుమార్లు చెప్పింది.