3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

పాక్‌వి ఉత్తమాటలే..

09-06-2025 02:11 AM

ఆదంపూర్ ఎయిర్‌బేస్ ధ్వంసం అవాస్తవం

న్యూఢిల్లీ, జూన్ 8: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ కూడా భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. ఆ దాడులు ఫలించకపోయినా కానీ మేము భారత్‌కు చెందిన వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం.. భారీ నష్టం చేకూర్చాం అంటూ పాక్ గొప్పలు చెప్పుకుంది. కానీ అవన్నీ అబద్దాలని భారత్ తిప్పికొట్టింది.

అయినా కానీ పాక్ గొప్పలు చెప్పుకోవడం ఆపలేదు. తాజాగా ప్రముఖ ఇమేజరీ అనలిస్ట్ డమియెస్ సైమన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన శాటిలైట్ చిత్రాలు.. పాకిస్థాన్ చెప్పినవన్నీ అబద్దాలే అని నిరూపించాయి. ఆదంపూర్ ఎయిర్ బేస్‌లో సుఖోయ్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్టు పాక్ విడుదల చేసిన చిత్రం కూడా ఫేక్ అని తేలింది. కేవలం ఆదంపూర్ వైమానిక స్థావరం మాత్రమే కాకుండా భుజ్ ఎయిర్ బేస్‌లోని రేడార్ సిస్టమ్‌ను కూడా కూల్చినట్టు పాకిస్థాన్ చెప్పుకుంది.

తమ వాదనలు నిజమని అంతా నమ్మేలా ఓ ఫొటోను కూడా విడుదలచేసింది. అయితే ఆ ఫొటో తప్పుడు ఫొటో అని తర్వాత తేలింది. పాక్ ప్రజెంట్ చేసిన ఫొటోలోని నల్లటి మరకలు ఎస్‌ ఇంధనం మరకలని తేలింది. పాక్ ఈ ఆరోపణలు చేసిన తర్వాత ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి.. ఎస్ ముందు ఫొటోలు దిగారు.