8 May, 2026 | 1:33 AM

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

10-12-2024 08:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో పాత విగ్రహాన్ని మార్చడానికి నివసిస్తూ టిఆర్ఎస్ పార్టీ మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పాత తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహంలో బతుకమ్మ తలపై కిరీటం మార్పులు చేసి కాంగ్రెస్ మార్కు సాధించేలా విగ్రహాన్ని రూపొందించాలని పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రిజ్వాన్ ఖాన్ తత్తులు పాల్గొన్నారు.