8 May, 2026 | 2:35 AM

విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకే ఆటల పోటీలు

10-12-2024 08:32 PM

జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ...

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో సీఎం కప్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి, పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతలుగా ఎదగాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, ఎల్లారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, మాజీ జెడ్పిటిసి సామెల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఆశమొల్ల సాయిబాబా, మాజీ ఎంపీటీసీ షెకవత్ అలీ, ఎల్లారెడ్డి మండలం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ గఫర్, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగం శంకరయ్య, గంగారెడ్డి, భిక్కనూరు సంజీవరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.