8 May, 2026 | 12:36 AM

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

10-12-2024 08:14 PM

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్...

మందమర్రి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్ కోరారు. సారంగపల్లి గ్రామానికి చెందిన శెట్టి వనితకు మంజూరైన 19000/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఒడ్నాల కొమురయ్య, రాచకొండ కమల మనోహర్ రావు, కాంగ్రెస్ నాయకులు రాయమల్లు, కొట్రంగి పున్నంలు పాల్గొన్నారు.