19-07-2024 03:16:45 PM
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంటల రుణమాఫీ నిధులను గురువారం విడుదల చేసింది. శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ సాగుతుంది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ట్రాక్టర్ నడుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.