calender_icon.png 21 July, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుపురుగు పెంపకంలో సాంకేతిక ఈ యజమాన్య పద్ధతులు పాటించాలి

19-07-2024 01:09:07 PM

పట్టు పరిశ్రమ ములుగు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్

హుజురాబాద్: పట్టు పురుగుల పెంపకంలో సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించి మంచి లాభాలు పొందవచ్చని పట్టు పరిశ్రమ శాఖ ములుగు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో పట్టుపురుగుల కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. సాగు చేస్తున్న రైతులను వివరాలను తెలుసుకున్నారు. పురుగుల పెంపకంలో రైతులకు పలు సాంకేతిక అంశాలను తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులు వేసే విధానం, రూట్ రాట్ వేరు కుళ్ళు, తుక్రా వ్యాధి నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టుపురుగుల పెంపకంలో అవసరమైన సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని, దీనివల్ల పట్టు పురుగులకు పాలు కారు రోగం, సున్నపుకట్టు, ప్లాచరీ (సచ్చు రోగం), పెబ్రిన్ మొదలగు వ్యాధుల ద్వారానే కాకుండా ఊజీ ఈగ తాకిడి వల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని వినోద్ కుమార్ తెలిపారు.