calender_icon.png 22 July, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి

19-07-2024 03:25:53 PM

కరీంనగర్: పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శుక్రవారం విలేకరులతో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ లో మేము త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. కేసీఆర్ తప్పు చేసి ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టారని దాన్ని మళ్ళీ నిర్మించాల్సిందే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.