12 June, 2026 | 12:20 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

15 లోపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

03-02-2025 01:26 AM
  1. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి
  2. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా.. అని హద్దు మీరొద్దు
  3. పార్టీ నష్టపోయే పరిస్థితులు తీసుకురావొద్దు: మంత్రి పొంగులేటి

వైరా, ఫిబ్రవరి 2: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 15లోపే రానున్నదని, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండ లం విప్పలమడకలో ఆదివారం  పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కాదా అని హద్దు మీరొద్దని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జాగ్రత్తగా వహించాలని, అర్హులందరికీ ఇండ్లు అందేలా చూడాలన్నారు.

మంత్రి అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు కాల్‌చేసి రైతుల వద్ద మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ తది తరులు పాల్గొన్నారు.