03-12-2025 11:58:23 AM
హైదరాబాద్: గ్రామ పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. కొన్ని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలు లేకున్నా వారికే రిజర్వ్ చేశారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆరు పిటిషన్లపైనా విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది. పిటిషన్లను డివిజన్ బెంచ్ లో ఉంచాలని రిజిస్ట్రీకి సింగిల్ బెంచ్ సూచించింది. పిటిషన్లకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. పూర్తి డాక్యుమెంట్ ఇచ్చాక పిటిషన్లను సీజే ధర్మాసనం విచారించనుంది. తెలంగాణలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ జరుగుతోంది. 182 మండలాల్లో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఎల్లుండి నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు, డిసెంబర్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు.