03-12-2025 12:27:18 PM
హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office) నుంచి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ యువ, మహిళా మోర్చా పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రేవంత్ రెడ్డి హిందూ ద్వేష వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు(BJP state president N Ramchander Rao) హిందూ దేవీ-దేవతలపై, హిందూ సమాజంపై వ్యంగ్య భాషను వాడి, అనుచిత వ్యాఖలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తన హిందూ ద్వేషాన్ని వెళ్లగక్కాడు. ఈ విద్వేషపూరిత వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ఈ నిరసనలో బీజేపీ శ్రేణులకు, హిందూ సమాజం భారీ ఎత్తున పాల్గొని, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ హిందువులు, హిందుదేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి రేవంత్ పై విమర్శలు గుప్పించారు.