13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

మా ఇంటి బంగారం వచ్చేది అప్పుడే

23-02-2026 01:56 AM

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. డైరెక్టర్ నందినిరెడ్డి ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

’ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందినిరెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 15న వరల్ వైరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సమంత ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్; యాక్షన్: లీ విట్టాకెర్; ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదుర్; ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల; స్టోరీ, స్క్రీన్‌ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మారింగంటి, సీతా మీనన్.