10 March, 2026 | 5:40 AM

పంటల కొనుగోళ్లలో ప్రభుత్వాలు విఫలం

10-03-2026 12:54 AM

రైతుల సంతకాల సేకరణలో  మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతు సం క్షేమంపై చిత్తశుద్ధి లేదని, వారి స్వలాభం కోసం పని చేస్తున్నారన్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమవుతామని  ప్రభుత్వా న్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం పని చేయకుండా రైతు సం క్షేమం కోసం పని చేయాలని హితవు పలికారు.

సోమవారం బేల మండలం సాంగిడి గ్రామంలో మాజీ మంత్రి ఎడ్ల బండిపై తిరుగుతూ ప్రతి రైతు కుటుంబాన్ని కలుస్తూ సంత కాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారిని అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. అనంతరం జోగు రామ న్న మాట్లాడుతూ... రైతు సంక్షేమం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, యూరియా ఇబ్బందులు లేకుండా చేసిందన్నా రు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుల నుండి పంట కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ప్రతి పంటను రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానీకే దక్కిందని కొనియాడారు. 

కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలలో పంటను అమ్మేందుకు కూడా రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి తరుణంలో రైతాంగానికి బిఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటూ ఎంపీ ఎమ్మెల్యేల ఇంటి ముట్టడితో పాటు, బేల మండల జాతీయ రహదారి దిగ్బంధం, బోరజ్ జాతీయ దహరి దిగ్బంధం, కలెక్టరేట్ ముట్టడి, ఇలా అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టి రైతుల పంటను కొనేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరిగింది అన్నారు. రైతులు ఎప్పుడూ అధైర్య పడవద్దని ఎల్లవేళల తమ పార్టీ అండగా ఉంటూ ఉద్యమాలు చేపడుతుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.