calender_icon.png 17 July, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేపర్ పద్మారావు గుండెపోటుతో మృతి...

17-07-2025 12:33:28 AM

నివాళులర్పించిన జర్నలిస్టులు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు  

వైరా,(విజయక్రాంతి): వైరాలో గత మూడు దశాబ్దాలుగా పేపర్ బాయ్ గా పని చేసిన నండ్రు పద్మారావు (55)గుండెపోటుతో మరణించారు.. ఆయనకు భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.. పేపర్ బాయ్ గా 30 ఏళ్ల పాటు తన మంచితనంతో ప్రజల మన్ననలు పొందారు. కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఎప్పుడూ నవ్వుతూ తనకున్న ఇద్దరు కొడుకులను ఉన్నతంగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచేందుకు ఆయన చేసిన కృషి చేశారు. పద్మారావు మృతి వార్తవిషయం తెలుసుకున్న జర్నలిస్టులు రాజకీయ పార్టీల నాయకులు  ప్రజా సంఘాల నాయకులు  వైరా బ్రాహ్మణపల్లిలోని పద్మారావు ఇంటి వద్ద ఆయన భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.