17-07-2025 12:34:10 AM
ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్
ఎల్లారెడ్డి, జూలై 16 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో వచ్చే ఆదివారం జరగనున్న ముత్యాల పోచమ్మ ఆలయ బోనాల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకావాలని బుధవారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. పాలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో జరిగే పాలరం బండి ఊరేగింపు కు తప్పకుండా వస్తానని తెలిపారన్నారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ బోన్ల సాయిలు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.