calender_icon.png 18 July, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయిలో ఆరు బంగారు పతకాలు

17-07-2025 12:32:40 AM

తక్కడపల్లి ప్రతిభను సన్మానించిన గ్రామస్తులు 

కామారెడ్డి, జూలై 16 (విజయ క్రాంతి), జాతీయస్థాయి ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ బాక్సింగ్ పోటీల్లో కామారెడ్డి జిల్లా తక్కడపల్లి గ్రామానికి చెందిన ప్రతిభ ఆరు బంగారు పథకాలను సాధించారు. కలకత్తాలో ఇటీవల జరిగిన ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హాస్యం చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని తక్కడపల్లి ప్రతిభ 6 బంగారు పతకాలను సాధించారు.

సిరియాలో జరగనున్న ప్రపంచ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్  ప్రగతిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ఆరు బంగారు పతకాలు సాధించి తెలంగాణ పేరు ప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారన్నారు. కామా రెడ్డి జిల్లా ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతం నుండి ఆరు బంగారు పథకాలను తీసుకురావడం ప్రతిభ గొప్పదనం అని కొనియాడారు. జిల్లాలోని క్రీడాకారులు, విద్యార్థులు ప్రతిభను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.