వనదేవతలను దర్శించుకున్న పరకాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం
మేడారం, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల ఆశీస్సులతో పరకాల నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పరకాల నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్, పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






