కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్‌షిప్‌లో పారమిత విద్యార్థిని ఘనత
11-05-2026 12:00 AM
ముకరంపుర, మే 10 (విజయ క్రాంతి): కాగ్నిటివ్ స్కోర్ ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ’కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ - తెలంగాణ 2026’లో కరీంనగర్కు చెందిన పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థిని ఎం. యువన అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.
హైదరాబాద్లోని టి-హబ్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో జయప్రకాష్ నారాయణ్ చేతుల మీదుగా లక్ష రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.ఎం. ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపల్ గోపికృష్ణ పరాంకుశం, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, ఉపాధ్యాయ బృందం అభినందించారు.






