కర్భాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద జంటకు పెళ్లి
11-05-2026 12:00 AM
ఇబ్రహీంపట్నం, మే10(విజయక్రాంతి) ఇబ్రహీంపట్నం మండలంలోని భర్తీపూర్ కర్భాల దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద జంటకు మోహన్ యోగి ఆధ్వర్యంలో ఆదివారం పెళ్లి జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు కు చెందిన సాయి భర్తీపూర్ కు గ్రామానికి చెందిన గంగోత్రి నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వీరు వివాహం కోసం ట్రస్ట్ గురువు మోహన్ యోగిని సంప్రదించడం తో ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి వివాహం జరిపించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.






