17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గాంధీ విగ్రహానికి పార్ట్‌టైం అధ్యాపకుల వినతి

29-04-2025 01:18 AM

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు ఏడవ రోజు సమ్మెలో భాగంగా సోమవారం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గాంధీ దృష్టిలో విద్య అనేది సమానత్వం సాధించడానికి ఒక సాధనమని అన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గాంధీ అభిప్రాయపడ్డారు.   విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకుల విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ, అలాంటి విశ్వవిద్యాలయాలలో నేడు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు.

తమకు ఇప్పటివరకు కనీస వేతనం కూడా లేదని అన్నారు. జి.ఓ 21 ని సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ర్టంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా పార్ట్ టైం అధ్యాపకుల న్యాయపరమైన డిమాండ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.