15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధాన్యం కొనుగోళ్ల్లను వేగవంతం చేయాలి

29-04-2025 01:15 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 29: రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలం లోని  గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు.

ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోళ్లు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, వంటి ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. రైతుల మాట్లాడుతూ, లారీల కొరత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.