5 April, 2026 | 9:25 AM

అభివృద్ధిలో పాలుపంచుకోవాలి

07-12-2024 07:30 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలులో పాలుపంచుకోవాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాబురావును కోరారు. శనివారం హైదరాబాదులోని అన్ని నివాసంలో సక్కు, బాబురావు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, డిసిసి విశాఖ ప్రసాద్ రావులను శాలువాతో సత్కరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం ఉందని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మీ చేరిక దోదపడుతుందని తెలిపారు.