ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమం ప్రారంభం
ఫార్చువల్ లో ప్రారంభిచనున్న సీఎం, మంత్రి శ్రీధర్ బాబు
మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్
ముత్తారం (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో సీఎం, మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఫార్చువల్ లో నేడు ఇంటి ఇంటికి ఇంటర్ నెట్ కార్యక్రమం పనులను శనివారం పనులు ప్రారంభించనున్నారని మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో జారుగుతున్న పనులు పరిశీలించి తగు సూచనలు జారిచేశారు. గ్రామ పంచాయతీలో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఉదయం ప్రారంభించాబోయే ఇంటి ఇంటికి ఇంటర్ నెట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ దొడ్ల గీతా రాణి బాలాజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ, నాయకులు మద్దెల రాజయ్య, పంచాయతీ కార్యదర్శి తో పాటు టీ-పైబర్ సిబ్బంది ఉన్నారు.




