12 May, 2026 | 1:22 AM

జనగణన సర్వేలో భాగస్వాములుకండి

12-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా 

నిర్మల్ మే 11 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన సర్వే హౌస్ హోల్డింగ్ సర్వే సిబ్బందికి ప్రజలు సంపూర్ణ వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని తలవేద గ్రామంలో హౌస్ హోల్డింగ్ సర్వే ప్రారంభించి సర్వే ఎలా చేస్తున్నారన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

నిర్మల్ జిల్లాలో ప్రా రంభమైన సర్వేకు ప్రజలు అన్ని వివరాలు తెలపాలన్నారు. మూడు మున్సిపాలిటీలు 400 గ్రామపంచాయతీలో సుమారు 1400 మంది ఇమ్యులేటర్లు 200 మంది సూపర్వైజర్లు సర్వే సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు సిపిఓ జీవరత్నం డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ ఎం పి ఓ శ్రీనివాస్ గౌడ్ తాసిల్దార్,సిబ్బంది పాల్గొన్నారు.