జనగణనకు సహకరించాలి
గట్లమల్యాల సర్పంచ్ ఇంగే నరేష్
నంగునూరు, మే 11: భారత ప్రభుత్వం చేపట్టిన 2026-27 జనగణన ప్రక్రియలో భాగంగా మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామస్తులు ఎన్యూమరేటర్ల కు సహకరించి సరైన వివరాలు అందించాలని సర్పంచ్ ఇంగే నరేష్ కోరారు.సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడతగా గృహాల లెక్కింపు జరుగుతుందని,పూర్తిస్థాయి జనాభా గణన 2027 ఫిబ్రవరిలో ఉంటుందని తెలిపారు. వివరాలు సేకరించడం ప్రభుత్వ పథకాలు కోత పడతాయ నే అపోహలు నమ్మవద్దని,ప్రజల స్థితిగతుల కోసమే ఈ లెక్కింపు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయ్ కుమార్, ఎన్యూమరేటర్లు శ్రీకాంత్, రామకృష్ణ, ఎల్లం,లావణ్య, రజిత, కోరోబర్ రవి తదితరులు పాల్గొన్నారు.






