18 May, 2026 | 5:42 PM

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేద్దాం

22-04-2024 12:44 AM

బడంగ్‌పేట్ మేయర్ పారిజాత

మహేశ్వరం, ఏప్రిల్ 21 : చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలో 31వ వార్డు డివిజన్‌లో పార్టీ శ్రేణులతో కలి సి ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మేయర్ పారిజాత  మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు విజయవంతంగా అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ ఇచ్చిన సోని యమ్మ రుణం తీర్చుకోవడానికి మనమంత హాస్తం గుర్తుకు ఓటు వేసి దేశానికి రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేయలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్‌రెడ్డి, చంద్రపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాకేష్, భాస్కర్‌రెడ్డి, గిరి ముదిరాజ్ పాల్గొన్నారు.