ఒకరికి జైలు శిక్ష
03-05-2025 02:04 AM
అర్మూర్, మే 02 (విజయ క్రాంతి) : మద్యం తాగి వాహనం నడిపిన కేసులో జడ్జి ఒకరికి జైలు శిక్ష విధించినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవర్ నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టణానికి చెందిన కంఠం అక్షయ పట్టుబడినట్లు తెలిపారు. సదరు వ్యక్తిని కోర్టులో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆయన వివరించారు.






