కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి
నారాయణఖేడ్ లో సంగటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని, నారాయణ్ఖేడ్, ఆగస్టు 2౧(విజయ క్రాంతి) కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సంగటన్ శ్రీజన్ అభియాన్ పీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.నారాయణ్ఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో శ్రీను బాబు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోర్తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నాయకులు, కార్యకర్తలకు శ్రీను బాబు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకువచ్చేలా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఎండీ రియాజ్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






