టాయిలెట్‌ను శుభ్రం చేసిన మంత్రి జూపల్లి
22-08-2026 01:36 AM
పెంట్లవెల్లి, ఆగస్టు 21: పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో టాయిలెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య సామగ్రి, టైల్స్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించారు.
కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి తెలిపారు.






