నిరాశ పరిచిన పరుల్ చౌదరీ
31-07-2026 12:00 AM
- ఐదో స్థానంతో సరి
- ప్రతికూల వాతవరణమే కారణమన్న అథ్లెట్
గ్లాస్గో, జూలై 30 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఖచ్చితంగా పతకం గెలుస్తుందనుకున్న భార త స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల 3000 స్టీపుల్ ఛేజ్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పరుల్ అనూహ్యంగా ఐదో స్థానంతో సరిపెట్టుకుని పత కానికి దూరమైంది.
పరుల్. 9:26.75 టై మింగ్‌తో రేసును పూర్తి చేసింది. ఫలితంగా తొలిసారి కామన్వెల్త్లో పతకం సాధించాలనుకున్న ఆమె కల నెరవేరలేదు.. సన్నద్ధత పరంగా అంతా బాగున్నప్పటికీ పత్రికూల వాతావరణం దెబ్బతీసిందని ఆమె వాపోయింది. ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని, ఇక ఆసియా క్రీడల్లో పోడియం లక్ష్యంగా సిద్ధమవుతానని చెప్పిం ది. 2023 ఆసియా క్రీడల్లో ఆమె రెండు విభాగాల్లో మెడల్స్ గెలిచింది.






