పార్వతి బరాజ్ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం
22-07-2024 12:20 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతి (సుందిళ్ల) బరాజ్ కరకట్టకు ప్రమాదం ప్రమాదం పొంచి ఉంది. మూడు సంవత్సరాల క్రితం వరద నీటి ప్రవాహంతో దెబ్బతిన్న బరాజ్ కరకట్టకు అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం కనిపిస్తోంది.




