సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత
సత్తా చాటిన భారతీయ విద్యాభవన్ ఆత్మకూరి రామారావు పాఠశాల
హైదరాబాద్, ఏప్రిల్ 1౬ (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ ఆత్మకూరి రామారావు పాఠశాల 2026 సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలి తాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి అద్భు త విజయాన్ని నమోదు చేసింది. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఘనత సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
ఈ ఫలితాల్లో జస్విత జంగ మ 487 (97.4%) మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలవగా, బుర్రా లలితకుమార్, యల్లమ్మగారి జస్వంత్485(97%) మార్కులతో ద్వితీయ స్థానాన్ని, రాజ్ హర్షిత్ టి 484(96.8%) మార్కులతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా చూస్తే, సంస్కృతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లో విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించడం విశేషం.
ఇంగ్లిష్, తెలుగు భాషల్లో 99 మార్కులు, సైన్స్, సోషల్ సైన్స్‌లో 98 మార్కు లు అత్యధిక స్కోర్‌గా నమోదయ్యాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు టాప్ స్కోర్ సాధించడం, పాఠశాల అందిస్తున్న ఆధునిక సాంకేతిక విద్యకు నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీలతనాయర్ మాట్లాడుతూ.. విద్యార్థుల అద్భుత ప్రతిభను అభినందించారు. నాణ్యమైన విద్యా బోధన మరియు సమష్టి కృషి వల్లనే ప్రతి ఏటా ఇలాంటి విజయాలు సాధిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు కలగాలని పాఠశాల మేనేజ్మెంట్ ఆకాంక్షించింది.






