17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కిటకిటలాడుతున్న ఎంజీబీఎస్, జేబీఎస్

10-01-2026 11:36 AM

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. మకర సంక్రాంతికి(Makar Sankranti) వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ కిటకిటలాడుతున్నాయి. దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, తార్నాక కూడళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అటు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వాహనాలతో ప్రధాన రహదారులపై రద్దీ పెరిగింది.  సంక్రాంతి పండుగను సొంతవాళ్లతో జరుపుకునేందుకు పట్నం జనం పల్లెబాట పట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై బారీగా పెరిగిన వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.