10-01-2026 11:12:18 AM
హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా హైదరాబాద్ వాసులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్- విజయవాడ హైవే(Hyderabad Vijayawada National Highway) మరింత రద్దీ పెరగనుందని అధికారులు వెల్లడించారు. ఎన్ హెచ్-65పై పలు చోట్ల వాహనాలు స్తంభించే అవకాశముందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా(Panthangi Toll Plaza) వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. కేతేపల్లి (మం) కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద ఇదే సీన్ కనిపిస్తోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ పెరిగే అవకాశముందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని కోరారు. టోల్ ప్లాజా, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.