06-01-2026 12:00:00 AM
కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలోమన్
హనుమకొండ టౌన్, జనవరి 5 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం జనవరి 25 నుండి 31 తేదీలలో నిర్వహిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం వరంగల్ లోని జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలోమన్, వరంగల్ రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను లు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ మేడారం జాతర 2026 సందర్భంగా రాష్ట్రంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్ లకు ప్రయాణికుల పట్ల, భద్రత, ట్రాఫిక్ నియంత్రణలపై కీలక సూచనలు తెలియజేశారు. జాతర విధులకు నియమించబడే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా పాటించేల నిరంతర పర్యవేక్షణ చేయాలి. విధుల్లో ఉన్న సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా క్రమశిక్షణతో వ్యవహరించేలా అవగాహన కల్పించారు. మద్యం సేవించి విధులకు హాజరవ్వడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అనుచిత ప్రవర్తనకు శూన్యసహనం పాటించబడుతుందని స్పష్టంగా తెలియజేశారు.
ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్, ఇతర శాఖలతో సమర్థవంతమైన సమన్వయం కొనసాగించాలి. విధుల్లో వాహనాలు నిలిచిపోవడం ప్రమాదాలు ఇతరత్రా సాధారణ సంఘటనలు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సురక్షితమైన, సక్రమమైన సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఎం) పి. మహేష్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఓ) దేశరాజ్ భాను కిరణ్, ఏటీఎం ఎం. మల్లేషయ్య, డిపో మేనేజర్లు పి. అర్పిత, రవిచంద్ర, పిఓపి సైదులు, ఎంప్లాయ్ బోర్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.