06-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఆర్షకవి చెన్నప్ప రచించిన ‘వాట్సప్పీయం’ పుస్తకా న్ని ఈ నెల 7న రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ మంజులా, మల్లికార్జున్‌రెడ్డి దంపతులకు అంకితం ఇవ్వనున్నారు.
మహాకవి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి (పూర్వ అధ్యక్షుడు, తెలు గు శాఖ, ఓయూ) సభాధ్యక్ష వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి జనార్ద న్‌రెడ్డి (మాజీ ఐఏఎస్), డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుడు), బైస దేవదాసు, ఆచా ర్య దేవరాజు రాంబాబు, శంకర నారాయణ, కాకరాల పద్మాకర్, రావూరి వనజ, ప్రమీల హాజరుకానున్నారు.