calender_icon.png 11 January, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మశాలలో వైద్య శిబిరం

06-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలు సమాజ సేవ కు  ఎంతగానో దోహదం చేస్తాయని బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్, చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం బేగంబజార్‌లోని సనాతన ధర్మశాల ఆవరణలో సత్య సుందర్, హెల్పింగ్ హాండ్స్ ఫౌం డేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ నేతృత్వంలో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ఉమా మహేందర్, బిజెపి సీనియర్ నాయకులు రఘునం దన్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, దినేష్ యాదవ్, బెన్నీ శ్రీనివాస్, దినే ష్ హజారి హాజరయ్యారు. వెయ్యి మందికి పైగా చికిత్సలు, అవసరమైన వారికి, మందులను ఉచితంగా అందజేశామని చైర్మన్ టా గూర్ గోపాల్ సింగ్ అన్నారు. ఈసారి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్స్ స్కానింగ్, పెట్ స్కానింగ్, నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మెడిసిటీ ఆసుపత్రి సీఈవో ఈ నీష్ మర్చంట్, రాను సింగ్ రాజ్ పురోహిత్, సత్య సుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.