16 April, 2026 | 6:09 AM

బాటసారుల శ్రమదానం

01-11-2025 12:07 AM

ఇందుర్తి బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు 

 చిగురుమామిడి, అక్టోబర్ 31(విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి - కోహెడ వెళ్లే రహదారి బ్రిడ్జిపై ఎల్లమ్మ వాగు పొంగి పర్లడంతో రెండు రోజులు వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి శుక్రవారం కొంత తగ్గడంతో బాటసారులు శ్రమదానం చేసి ఇందుర్తి బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కాలంలో వరుసగా కురుస్తు న్న వర్షాలకు ఎల్లమ్మ వాగు తరచూ పొంగిపొర్లడంతో పురాతన బ్రిడ్జిపై పలు ప్రదేశా ల్లో గుంతలు పడ్డాయి. వాహనదారులకు ఇ బ్బంది కలుగకుండా బాటసారులు శ్రమదానం చేసి తత్కాలికంగాబాగుచేశారు.