స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు న్యాయం చేయండి
డీవోపీటీ, పీఎంవోకు సామాజిక కార్యకర్త రవి ముదిరాజ్ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : డీఎస్సీ-2024 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేయా లని కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫామ్స్ పబ్లిక్ గ్రీవెన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సామాజిక కార్యకర్త నీలం రవి ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రీ వెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించకుండానే 13 నెలలుగా 33 మంది అనర్హులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో జరిపిన నియామకాల్లో సగానికిపైగా అనర్హులు అని క్రీడాశాఖ గతంలో తేల్చినా, నవంబర్ నుంచి అక్టోబర్ వరకు పలు దఫాలుగా విద్యాశాఖకు నివేదికలు పంపించినా, దాన్ని విద్యాశాఖ తిప్పి పంపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీవోపీటీ సంస్థకు, ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదును స్వీకరించిన కేంద్రం ప్రభుత్వ సంస్థ 21 రోజుల్లో ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకోనుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.






