calender_icon.png 15 June, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుండిగల్‌లో పాసింగ్ అవుట్ పరేడ్

15-06-2025 12:14:51 AM

ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు 

మేడ్చల్, జూన్ 14 (విజయక్రాంతి): దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం ఫ్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో భాగంగా నిర్వహించిన విమానాల విన్యాసాలు ఆక ట్టుకున్నాయి. క్యాడెట్ల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను చూసి ఉప్పొంగిపోయారు.