18 April, 2026 | 3:54 PM

Breaking News

సీఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్

08-06-2025 12:06 AM

మేడ్చల్, జూన్ 7 (విజయక్రాంతి): హకీంపేట్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో 49వ బ్యాచ్ సిఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. 347 మంది ఎస్‌ఐలు ఏడాది పాటు శిక్షణ పొందారు. ఇందులో 42 మంది మహిళ ఎస్త్స్రలు ఉన్నారు.

వీరు దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో చేరనున్నారు. పరేడ్‌కు ముఖ్య అతిథిగా సిఐఎస్‌ఎఫ్ సెంట్రల్ సెక్టార్ ఐజి నీలిమ రాణి సింగ్ హాజరయ్యారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి బహుమతులు ప్రధా నం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలు కవాతు చేశారు.