18 July, 2026 | 12:24 AM

త్వరలో పటేల్ కుంట సుందరీకరణ పనులు

18-07-2026 12:00 AM

ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఉప్పల్, జూలై 17 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న పటేల్ కుంట చెరువుకు త్వరలోనే సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఆయన చెరువును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజ లు, బస్తీవాసులు, పార్టీ నాయకులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే, చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. హెచ్‌ఎం టీ నగర్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు జరుగుతున్న తరహాలోనే పటేల్ కుంట చెరువును కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

చెరు వులోని గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తవడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం తో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు మెరుగుపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే చెరువు సుందరీ కరణకు సంబంధించిన కార్యాచరణ రూ పొందించి అభివృద్ధి పనులు ప్రారంభి స్తామని ఆయన హామీ ఇచ్చారు.  దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పటేల్కుంట చెరువుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్, మారయ్య, శివకుమార్, యూసుఫ్, ప్రభాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.