09-09-2025 09:52:36 AM
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
పెన్ పహాడ్, విజయక్రాంతి: స్వచ్ఛమైన తాగునీటి అందక గ్రామ ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడడం గత ప్రభుత్వ వైఫల్యమేనని.. ఆ సమస్య పరిష్కారానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy) అన్నారు. సోమవారం రాత్రి పొట్లపహాడ్ గ్రామంలో దాతల సహకారం తో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఎన్నో ఏండ్లుగా గ్రామంలో వాటర్ ఫ్లాంట్ లేదని గ్రామస్తులు పలు సందర్భాలలో తెలపడంతో కోహాన్స్ సంస్థ యాజమాన్యం, గ్రామానికి చెందిన కాంగ్రెష్ యువ నాయకులు యడవెల్లి అఖిల్ రెడ్డి తన తండ్రి సంజీవరెడ్డి జ్ఞాపకార్ధంగా , అలాగే స్థల దాత ఎగ్గడి సత్యమయ్యలకు ఊరి సమస్యపై వివరించడం తో ముందుకు రాగా మార్చి 19న భూమి పూజ చేయగా నేడు రూ. 12 లక్షల తో చేపట్టిన ఫ్లాంట్ ను తిరిగి ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. దీంతో గ్రామ ప్రజలకు శాశ్వత పరిస్కారం అందించినందుకు దాతలకు రమేష్ రెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాంమూర్తి యాదవ్, యాట ఉపేందర్, యాదగిరి, రాజేష్ రెడ్డి, షకీల్, సలీం, సిద్ధూ, ఎక్బల్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.