06-02-2026 12:49:08 AM
లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
మేడారం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపంలో గురువారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.500 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొత్తం 828 హుండీల లెక్కింపులో భాగంగా మొదటిరోజు 125 హుండీలను తెరిచి నగదు లెక్కిం చగా 2కోట్ల 49 లక్షల 65 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు సమ్మక్క సారలమ్మ దేవాలయ ఈవో వీరస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నగదు కాకుండా హుండిల్లో లభ్యమైన ఇతర కానుకలను భద్రపరిచినట్లు చెప్పారు. హుండీల లెక్కింపు పది రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.